బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Homeతెలంగాణ.

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు ఖానాపురం, అక్టోబర్ 23 (మల్లేష్ నమస్తే భారత్): అర్హులైన పట్టభద్ర

సీనియర్ జర్నలిస్ట్ గోవర్ధన్‌ను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు

ఖానాపురం, అక్టోబర్ 23 (మల్లేష్ నమస్తే భారత్):
అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని నర్సంపేట
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) వైస్ చైర్మన్ ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శాఖమూరి హరిబాబు అన్నారు. ఖానాపురం మండలంలోని మనుబోతులగడ్డ గ్రామంలో నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్భంగా మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత ఇన్‌చార్జిలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అర్హులైన పట్టభద్రులకు ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించి, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ మండల కోఆర్డినేటర్ కోడి మల్లేష్, చలిగంటి మల్లిఖార్జున్ ,సోషల్ మీడియా ఇన్‌చార్జి నాంచారి కుమారస్వామి, సొసైటీ డైరక్టర్ శివరాత్రి వెంకన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.కె. కమాలుద్దీన్, నాయకులు తేజావత్ మిత్యా, ఎద్దు మహేందర్, ఆబోతు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: