బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి

Homeతెలంగాణ.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి క్లస్టర్ ఇంచార్జ్ ఆబోతు అశోక్ యాదవ్ ఖానాపురం అక్టోబర్ 23( మల్లేష్ నమస్తే భారత్) : ఖానాప

ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ
మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓటరు నమోదు కార్యక్రమం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులందరూ నమోదు చేసుకోవాలి

క్లస్టర్ ఇంచార్జ్ ఆబోతు అశోక్ యాదవ్

ఖానాపురం అక్టోబర్ 23( మల్లేష్ నమస్తే భారత్) :
ఖానాపురం క్లస్టర్ పరిధిలోని గ్రామాలకు చెందిన అర్హులైన పట్టభద్రులందరూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల
ఖానాపురం క్లస్టర్ ఇంచార్జ్ ఆబోతు అశోక్ యాదవ్ పిలుపునిచ్చారు. 2023 నవంబర్‌కు ముందు డిగ్రీ పూర్తి చేసి, ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హత కలిగిన పట్టభద్రులు నవంబర్ 6లోపు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఈసందర్భంగా అశోక్ యాదవ్ మాట్లాడుతూ, పట్టభద్రులు తమ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ముందుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఓటరు నమోదుకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ నంబర్, డిగ్రీ మెమో లేదా డిప్లొమా ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఫోన్ నంబర్ అవసరమని తెలిపారు. ఈ పత్రాలను అందజేసి మనుబోతుల గడ్డ గ్రామంలో ఉచితంగా ఓటరు నమోదు సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. వివరాలను వాట్సాప్ ద్వారా పంపించి కూడా నమోదు ప్రక్రియలో సహకారం పొందవచ్చని, స్వయంగా దరఖాస్తు చేసుకునేవారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని అశోక్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పట్టభద్రుడి గొంతుక అని, అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఓటరు నమోదు వివరాల కోసం
9948348025, 8099245757సంప్రదించవచ్చునన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: