ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక నమస్తే భారత్ :-తొర్రూరు తొర్రూరు డివిజన్ కేంద్రంలోని 5వ వార్డు దుబ్బ తండాలో ఉన్న శ్రీ అభయాం
ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
నమస్తే భారత్ :-తొర్రూరు
తొర్రూరు డివిజన్ కేంద్రంలోని 5వ వార్డు దుబ్బ తండాలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దసరా పండుగ సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతన కమిటీని భక్తుల సమక్షంలో పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు.మాజీ చైర్మన్ బాలాజీ తీర్మానం పెట్టగా అందుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ గా ధారావత్ శంకర్ (డివో), ప్రధాన కార్యదర్శిగా ధారావత్ జై సింగ్ నాయక్, కోశాధికారిగా భూక్యా హేమంత్ కుమార్,వైస్ చైర్మన్లుగా ధరావత్ నెహ్రు టీచర్, భూక్య శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో మన తండా ప్రజలు, గుడికి ఆర్థిక సాయం చేస్తున్న సభ్యులకు మరియు కొత్త కమిటీకి సహకరించిన ప్రతి సభ్యులకు కొత్త కమిటీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

COMMENTS