బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కాళిదాస్ షార్ట్ ఫిలింను ప్రారంభించిన సర్పంచ్ , ఎస్‌ఐ

Homeతెలంగాణ

కాళిదాస్ షార్ట్ ఫిలింను ప్రారంభించిన సర్పంచ్ , ఎస్‌ఐ

కాళిదాస్ షార్ట్ ఫిలింను ప్రారంభించిన సర్పంచ్ , ఎస్‌ఐ ఖానాపురం, అక్టోబర్ 21( మల్లేష్ నమస్తే భారత్ ) :వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంల

ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలి –ఆర్డివో రమాదేవి
చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా.. గుర్రప్ప తండాలో పోషణ మాసం
*శ్రీ బీఎం డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు*

కాళిదాస్ షార్ట్ ఫిలింను ప్రారంభించిన సర్పంచ్ , ఎస్‌ఐ

ఖానాపురం, అక్టోబర్ 21( మల్లేష్ నమస్తే భారత్ ) :వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో విజయదశమి సందర్భంగా నిర్వహించిన రావణ దహన ఉత్సవాల్లో భాగంగా ‘కాళిదాస్’ షార్ట్ ఫిలింను గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, ఎస్‌ఐ రామ్మోహన్ ప్రారంభించారు.
ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన జలగం రజిత, రమేష్ దంపతుల చిన్న కుమారుడు జలగం ఇనేష్ ఈ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించారు. వరంగల్‌లోని ఎల్బీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఇనేష్, ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలిం దర్శకుడిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆయన అన్నయ్య జలగం మహేష్ కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు జలగం ఇనేష్ మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు గ్రామ ప్రజల ఆదరణ, ఆశీర్వాదాలతో ‘కాళిదాస్’ షార్ట్ ఫిలిం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరై ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. షార్ట్ ఫిలిం రూపకల్పనలో సహకరించిన చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సింగు సుధాకర్, రావణవధ అధ్యక్షుడు శేరు మధు, పాలకవర్గ సభ్యులు ,

పైనేని ఉదయ్ కిరణ్, కొమ్ము శశాంక్, మోడం సాయికుమార్, సంజయ్, పులిగిల్ల విజయ్ ధరన్, ఇంతియాజ్ పాషా, ఓర్సు అరుణ్, కొమ్ము సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: