బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పోలీస్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి:  సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

Homeతెలంగాణ

పోలీస్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి: సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

పోలీస్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి: సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కే

ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్,
అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు
ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి

పోలీస్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలి:

సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని కార్గిల్ సెంటర్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ పోలీస్ అమరవీరుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణలో, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు ఎంతో కీలకమైనవని అన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిలో అమరులైన పది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరవీరుల త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0