ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఖానాపురం సెప్టెంబర్ 17 (నమస్తే భారత్ ) : ఖానాపురం మండలం బుధరావుపేటలో విశ్వకర్మ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహ
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఖానాపురం సెప్టెంబర్ 17 (నమస్తే భారత్ ) :
ఖానాపురం మండలం బుధరావుపేటలో విశ్వకర్మ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండాను అవిష్కరించి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యక్షులు నేలకొండ యాకన్న చారి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి పూజలు నిర్వహిస్తామన్నారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడన్నారు.
ఈకార్యక్రమంలో బుధరావుపేట గ్రామ అధ్యక్షులు నేలకొండ యాకన్న చారి ఉపాధ్యక్షులు పోతుగంటి యోగానంద చారి ప్రధాన కార్యదర్శి అలుగోజు రవి కోశాధికారి సొల్లేటి భార్గవ చారి సహాయ కార్యదర్శి బెజ్జంకి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు బెజ్జంకి బ్రహ్మచారి కర్ట్లోజు వెంకటేశ్వర్లు , కమిటీ సభ్యులు రాజయ్య పైడిత చారి ఆచారి శ్రీకాంత్ ఉపేంద్ర చారి మదనాచారి నాగేంద్ర చారి పగిడిదాచారి తదితరులు పాల్గోన్నారు.

COMMENTS