బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మోడల్ స్కూల్ లో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

Homeతెలంగాణ

మోడల్ స్కూల్ లో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

మోడల్ స్కూల్ లో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు మహబూబాబాద్ (నమస్తే భారత్ ) : మహబూబాబాద్ మోడల్ స్కూల్ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను

ప్రజల ఆరోగ్యం కోసం పరిశుభ్రత.. సమస్యల పరిష్కారం కోసం నిరంతర సేవ!
*టిఆర్పి షాద్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎమ్మె సంతోష్ కుమార్*
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మోడల్ స్కూల్ లో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

మహబూబాబాద్ (నమస్తే భారత్ ) :
మహబూబాబాద్ మోడల్ స్కూల్ లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను తెలుగు ఉపాధ్యాయులు బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తేనే నా ఎదుట మనిషివి’ అని చాటిన గొప్ప మానవతావాది కాళోజీ అని కొనియాడారు. విద్యార్థులు ఆయన స్ఫూర్తితో అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: