బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఘనంగా పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు  జనసేన సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్

Homeతెలంగాణ

ఘనంగా పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు జనసేన సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్

ఘనంగా పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు జనసేన సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్ వరంగల్ సెప్టెంబర్ 7(నమస్తే భారత్ ) : వరంగల్ పశ్చిమ ని

వార్డ్ సభ్యులు బోళ్ల రమేష్ నాయినమ్మకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడి నివాళి బోళ్ల లచ్చమ్మ పార్థివ దేహానికి పూలమాలతో నిళులర్పించిన సమ్మిగౌడ్
*మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారు*
పాపన్నపేట పద్మశాలీల ఆధ్వర్యంలో ఘనంగా గోపాల కాల్వల పూజ,ఆంజనేయ స్వామీ,శివునికి అభిషేకం కార్యక్రమం

ఘనంగా పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు

జనసేన సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్

వరంగల్ సెప్టెంబర్ 7(నమస్తే భారత్ ) :

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేటలోని విష్ణుపురి ప్రాంతంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో జనసేన ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ
“బోనాలు తెలంగాణలో ఎంతో విశిష్టమైన సంప్రదాయ పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, భక్తి, జానపద కళలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో
మేకల ప్రసన్న కుమార్, బస్కుల శివాజీ, దండు రంజిత్, జక్కుల ప్రవీణ్, జక్కుల ప్రశాంత్, రాజ మహేష్, కాలనీ వాసులు జనసేన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: