బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*లక్ష్మీదేవిపల్లి పై ప్రశ్నిస్తే బెదిరింపులు సరికాదు. సమాధానాలు వెతకండి!*

Homeతెలంగాణ

*లక్ష్మీదేవిపల్లి పై ప్రశ్నిస్తే బెదిరింపులు సరికాదు. సమాధానాలు వెతకండి!*

*లక్ష్మీదేవిపల్లి పై ప్రశ్నిస్తే బెదిరింపులు సరికాదు. సమాధానాలు వెతకండి!* *ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే ప్రతిఫలంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే దా

*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*
*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టాలి.*
వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.డీఎస్ రెడ్యా నాయక్

*లక్ష్మీదేవిపల్లి పై ప్రశ్నిస్తే బెదిరింపులు సరికాదు. సమాధానాలు వెతకండి!*

*ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తే ప్రతిఫలంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే దానికి మేము సిద్ధమే.*

*ప్రజా సంఘాల నాయకులు*

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్06: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పై ప్రజా సంఘాలుగా ప్రజల పక్షాన మాకు ఉన్న అనుమానాలను ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రతిఫలంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రజా సంఘాల నాయకులు తిరుమలయ్య, పినపాక ప్రభాకర్, టీజీ.శ్రీనివాస్, రవీంద్రనాథ్, బి.సత్యం , అర్జునప్ప, ప్రశాంత్, శ్రీకాంత్, ఆకాష్ నాయక్, సత్యనారాయణలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ….. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణకు నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో ప్రజా సంఘాలుగా మేము ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ ను బయట పెట్టాలని, ఈ రిజర్వాయర్ ద్వారా రైతాంగానికి , పరిశ్రమలకు ఎంత నీరు కేటాయిస్తారు అనే విషయం ప్రభుత్వం చెప్పాలి అని డిమాండ్ చేసాము. అదే విధంగా సాగు నీరు, త్రాగు నీరు అందించటం ప్రాజెక్టుల యొక్క ముఖ్య ఉద్దేశం . అందువల్ల మేము రైతాంగానికి మొత్తం ఎన్ని ఎకరాలకు ఏయే నియోజకవర్గాలలో, ఏయే మండలాలలో నీరు అందిస్తారు అనేది ప్రజలకు తెలపాలని కోరడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదట డిజైన్ జూరాల నుండి నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదిత దశలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సామర్ధ్యం 10 టీఎంసీ లుగా ఉంది. కానీ గత ప్రభుత్వం డిజైన్ ను మార్చిన తరువాత రిజర్వాయర్ సామర్జ్యాన్ని 2.8 టీఎంసీ లుగా ప్రదీపాదన చేశారు. దీని ద్వారా 4 లక్షల 13 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రతిపాదనలు చేశారు. గత ప్రభుత్వం ఈ రిజర్వాయర్ ను విస్మరించిన సందర్భంగా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వాయర్ ను మొదలు పెడుతున్న తరుణంలో ఈ రిజర్వాయర్ కింద సాగు నీరు ఎన్ని ఎకరాలకు ఆయకట్టు ఉన్నదో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉంది.గత మూడు దశాబ్దాలుగా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు అందించాలని ప్రజా సంఘాలు ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పాలమూరుకు అన్యాయమే చేశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలమూరుకు అన్యాయమే జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మరో సారి పాలమూరుకు అన్యాయం చేసే విధంగా డిండి ఎత్తిపోతల పథకం పేరుతో పాలమూరు రంగారెడ్డి కి రావాల్సిన నీటిని నల్గొండకు తరలిస్తున్నారు. ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నుండే నల్గొండకు నీటిని తరలిస్తే లక్ష్మీదేవిపల్లి కి చుక్క నీరు కోడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి డిండి లిఫ్టును అడ్డుకోవాలని చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో పర్యావరణ విధ్వంసం చేసే డేటా సెంటర్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతున్నాయి. డేటా సెంటర్ల నిర్వాహణకు సర్వర్లను చల్లబర్చటానికి విపరీతమైన నీటిని వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంశాలు దృష్టిలో ఉంచుకొని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ యొక్క డిపిఆర్ ను బయట పెట్టాలని డిమాండ్ చేయటం జరిగింది. మేము లేవనెత్తిన అంశాలపై సమాధానాలు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడటం అనేది నియంతృత్వ పాలనకు నిదర్శనం.
షాద్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజల నుండి , ప్రజాసంఘాల నుండి వచ్చే నిరసనలను అంగీకరించే స్థితిలో లేదు. నిరసనలు తెలపడం అనేది ప్రజాస్వామిక హక్కు , ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయాలి కానీ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ద్వారా బెదిరింపులు, అక్రమ కేసులు నమోదు చేయడం, ప్రజల నిరసనలను అదుపులోకి తీసుకురావాలని నియంతృత్వ విధానంతో పనిచేస్తుంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలు నియంతృత్వ పాలనా విధానాన్నీ ఎంచుకోవడం దురదృష్టకరం. ఈ మధ్య కాలంలో షాద్ నగర్ లో ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ సందర్భంలో బెదిరింపుల విధానాన్ని ఎంచుకోవడం హేయమైన చర్యగా భావిస్తున్నాం.ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలంటే ప్రజల యొక్క అసంతృప్తులకు చోటు కల్పించాలి. అలా కాకుండా అణిచివేతా విధానాలను ఎంచుకోవడం ప్రజాస్వామ స్పూర్తికి విరుద్ధం. ఈ ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా “ప్రజాస్వామ్య పునరుద్ధరణ” ను ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఇక్కడ పాలన కొనసాగుతుంది. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువస్తున్న ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాల నాయకులు “తగినమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని” ఇక్కడి కాంగ్రెస్ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తే అందుకు ప్రతిఫలంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే అందుకు మేము సిద్ధంగానే ఉంటాము. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం షాద్ నగర్లో ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయాలని, ప్రజలు , ప్రజా సంఘాలు లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని తెలియజేస్తున్నాం. మీ బెదిరింపులు, అక్రమ కేసుల వల్ల మా కార్యాచరణను నియంత్రించాలని అనుకోవడం సరైంది కాదు. ఇకనైనా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ బయట పెట్టాలని, డిండి లిఫ్ట్ ను వ్యతిరేకించాలని, డేటా సెంటర్లకు నీరు ఎక్కడనుండి ఇస్తారో చెప్పాలి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాజ తపదని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుమలయ్య, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కోశాధికారి టీజీ శ్రీనివాస్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు అర్జునప్ప, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్, పాలమూరు ప్రాజెక్టుల సాధన కమిటీ చైర్మన్ సత్యనారాయణ, బీసీ యువజన సంఘం నేత పసుపుల ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ నేత శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ నేత ఆకాష్ నాయకు లు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0