బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టాలి.*

Homeతెలంగాణ

*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టాలి.*

*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టాలి.* *ప్రజా సంఘాల నాయకుల డిమాండ్* నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్05: పాలమూరు రంగారెడ్డి ఎత్త

మృతి చెందిన యువకుడి కుటుంబానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పరామర్శ
*ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు ఈ నెల 15 వరకు పెంపు*
రోస్టర్ విధానంపై మాలల ఆగ్రహం.. తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన

*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టాలి.*

*ప్రజా సంఘాల నాయకుల డిమాండ్*

నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్05: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కు సంబంధించిన డిపిఆర్ ను బయట పెట్టాలని పౌరహక్కుల సంఘం రాష్ట్రకార్యదర్శి తిరుమలయ్య, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కోశాధికారి టీజీ శ్రీనివాస్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు అర్జునప్ప, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ కర్ణకోట రవీందర్ లు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుండి ప్రజలు , ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పోరాటం చేసారు. పాలమూరు కరువును , వలసలను నివారించాలంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారానే సాధ్యమని ఉద్యమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నాటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క డిజైన్ మార్చి జూరాల నుండి కాకుండా , శ్రీశైలం నుండి నీటిని ఎత్తి పోయాలని నిర్ణయించింది. అందుకోసం ఆరు రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టి చివరిదైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా రెండు లక్షల 70 ఎకరాలకు సాగు, తాగు నీరు అందిస్తామని చెప్పి లక్మిదేవిపల్లి రిజర్వాయర్ ను విస్మరించింది. దీనిని నిరసిస్తూ లక్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలని షాద్ నగర్ ప్రాంతంలో ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున్న పోరాటం చేశాయి. వివిధ రూపాలలో ఉద్యమం నిర్మించి అప్పటి ప్రభుత్వం పై వత్తిడి తెచ్చింది. ఆ ఉద్యమంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వరకు పాల్గొని రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేసింది. 2023 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా శంకర్ ఎన్నికయ్యాడు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లక్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం భూ సేకరణ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది, ఇది శుభపరిణామమే. కానీ ఇప్పుడు రిజర్వాయర్ సామర్ధ్యాన్ని 2.8 టీఎంసీ లుగా పేర్కొనడం అనేక అనుమానాలు కలగక మానదు. ఇంత తక్కువ సామర్ధ్యం వల్ల ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తారు అనేది తెల్వదు. దీనిని కేవలం తాగు నీటి ప్రాజెక్టుగానే పేర్కొవటం విడ్డూరం. నిజంగా ఇది తాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే అయితే రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండటమే కాకుండా ఈ ప్రాజెక్ట్ అసలు లక్ష్యం దెబ్బతిని పోతుంది. ఈ ప్రభుత్వం కూడా కేవలం పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా, రైతులకు నష్టదాయకంగా వ్యవహరిస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
లక్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం ద్వారా షాద్ నగర్ లో ఏర్పాటు అవుతున్న డేటా సెంటర్లకు నీటిని అందించటం కోసమే ఈ హడావుడి అనకుండా ఉండలేము.ఇప్పటికే ఎలికట్టా మరియు మేకగూడా గ్రామాలలో అదానీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి. ఇంకా రెండు డేటా సెంటర్లకు అనుమతులు కూడా లభించినట్లు తెలుస్తుంది. ఈ డేటా సెంటర్ల నిర్వాహణకు సర్వర్లను చల్లబర్చటానికి విపరీతమైన నీటిని వినియోగిస్తారు. మరి అంత నీటిని ఆ పరిశ్రమలు ఎలా సమకూర్చుకుంటాయి? బోర్లు వేస్తే సరిపోదు. బోర్ల ద్వారా నీటిని తిడితే భూగర్భంలో నీరే లేకుండా పోతుంది. ఇప్పుడు లక్మిదేవిపల్లి రిజర్వాయర్ పై ప్రభుత్వం నాయకుల హడావుడి చూస్తుంటే ఈ డేటా సెంటర్లకు నీటిని తరలించడానికి అనే అనుమానాలు కలుగుతున్నాయి. అందువలన వెంటనే లక్మిదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టీ ఈ ప్రాంత రైతులకు ఈ ప్రాజెక్ట్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలియ జెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉందని భావిస్తున్నాము.డిండి ఎత్తిపోతుల పథకం పేరుతో నల్గొండ జిల్లాకు నీటిని తరలించడమంటే పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టడమే అవుతుంది. ఈ డిండి ఎత్తిపోతుల పథకం ను ప్రజా ప్రతినిధులు అందరూ వ్యతిరేకించాలి. ప్రాణహిత చేవెళ్ల ద్వారా మరియు పాలమూరు రంగారెడ్డి ద్వారా లక్ష్మీదేవిపల్లికి నీటిని తరలించి చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, షాద్ నగర్, మహేశ్వరం మరియు నల్గొండ రైతాంగానికి సాగునీరు, తాగునీరుద్దించాలని డిమాండ్ చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: