బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

శిరీష కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి – సీపీఐ డిమాండ్

Homeతెలంగాణ

శిరీష కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి – సీపీఐ డిమాండ్

శిరీష కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి – సీపీఐ డిమాండ్ నమస్తే భారత్ :-గార్ల ఆదివాసి గిరిజన యువతి హాస్పటల్లో నర్స్ గా పని చ

International Literacy Day was celebrated at Krushi High School in Suraram Colony, Subhash Nagar Division.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న గుర్రం వెంకన్న
ఘనంగా పోచమ్మ బోనాల పాలారం బండి ఊరేగింపు జనసేన సీనియర్ నాయకులు డా. గోళ్ళ రాజేంద్రప్రసాద్

శిరీష కుటుంబానికి కోటి రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి – సీపీఐ డిమాండ్

నమస్తే భారత్ :-గార్ల

ఆదివాసి గిరిజన యువతి హాస్పటల్లో నర్స్ గా పని చేస్తున్నటువంటి ఓకే శిరీషపై హత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు షాన్ ఉల్లా ఖాన్ ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం గార్ల మండల కేంద్రంలోని నెహ్రూ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హత్య చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని అదేవిధంగా శిరీష కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం మరియు కోటి రూపాయలు ప్రకటించి శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని భవిష్యత్తులో మహిళలపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి మహిళలకు రక్షణగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులుభూక్యా హరినాయక్, ధూపాటి జనార్ధన్, భీముడు, బుక్య ఫుల్ సింగ్, లోకేష్, రాజేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: