కిషోర బాలికల ఆరోగ్యం, భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి నమస్తే భారత్ :-నెల్లికుదురు పోషణ మాసం సందర్భంగా కిషోర బాలికల్లో ఆరోగ్యం, పోషకాహారం, వ్యక
కిషోర బాలికల ఆరోగ్యం, భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలి
నమస్తే భారత్ :-నెల్లికుదురు
పోషణ మాసం సందర్భంగా కిషోర బాలికల్లో ఆరోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, భద్రత, విద్య మరియు మహిళా సాధికారతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన గూగుల్ మీట్‌లో డి డబ్ల్యూ ఓ శిరీష మేడమ్ పలు కీలక సూచనలు చేశారు.రేపు సాయంత్రం 5 గంటలకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కిషోర బాలికల సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గ్రామంలోని VOల సహకారంతో బాలికలను కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి, వారి ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, భద్రత, విద్య ప్రాధాన్యత, మహిళా సాధికారత తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
కిషోర బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాల్సిన అవసరం, పరిశుభ్రత పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు, విద్య ద్వారా భవిష్యత్తులో సాధించగల అవకాశాలు వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు. బాలికల భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి:
గ్రామస్థాయిలో నిర్వహించిన కార్యక్రమాలను కేవలం నిర్వహించడంతో సరిపెట్టకుండా, వాటి ద్వారా పోషణ మాసం లక్ష్యాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను తప్పనిసరిగా పత్రికలకు అందజేసి ప్రచారం కల్పించాలని తెలిపారు.
బెస్ట్ టీచర్, బెస్ట్ హెల్పర్ అవార్డులు:పోషణ మాసం చివరి రోజున ప్రాజెక్టు స్థాయిలో బెస్ట్ టీచర్, బెస్ట్ హెల్పర్ అవార్డులను.అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలు, వాటిలో పాల్గొనే వారి వివరాలు, చేపట్టిన అవగాహన కార్యక్రమాలపై సూపర్‌వైజర్లు జిల్లా గ్రూపులో సమాచారం మరియు ఫొటోలను పోస్ట్ చేయనున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి, వాటి వివరాలను ఎప్పటికప్పుడు.అందజేయాలని సూచించారు.డ్యాష్‌బోర్డ్‌లో ఫొటోల అప్‌లోడ్ తప్పనిసరి:ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన కనీసం 5 ఫొటోలను డ్యాష్‌బోర్డ్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి నుంచి కార్యక్రమాలపై ప్రతి గంటకోసారి క్రాస్‌చెక్ జరుగుతున్నందున ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రతిరోజూ ఫొటోలు అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.పోషణ మాసం కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేసి, కిషోర బాలికలకు అవసరమైన ఆరోగ్యం, పోషణ, భద్రత, విద్య మరియు సాధికారతపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమం లో కేశరాబాలికలు విఓ రాము అంగన్వాడీ టీచర్స్ కే.పద్మ పి. ఉమారాణి డి కవిత బి. సుగుణ తల్లులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS