బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..!

Homeతెలంగాణ

పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..!

పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..!   బ్లూ కోట్ పోలీసులకు రాఖీ కట్టిన ఓ సోదరి   మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం ఆగస్టు 28(నమస్తే భారత్)

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సొసైటీ చైర్ పర్సన్ వల్లె శ్రీనివాస్
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
పెరుగుతున్న ధరలు.. కుంగుతున్న పేదల బతుకులు – నిత్యావసర ధరలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి! సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.

పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..!

 

బ్లూ కోట్ పోలీసులకు రాఖీ కట్టిన ఓ సోదరి

 

మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం ఆగస్టు 28(నమస్తే భారత్)

 

అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి పర్వదినాన ఓ ఆత్మీయ దృశ్యం పాపన్నపేటలో ఆవిష్కృతమైంది. ప్రజల రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మెదక్ జిల్లా పాపన్నపేట బ్లూ కోట్ పోలీసులకు ఓ సోదరి రాఖీ కట్టి పోలీసులపై తనకున్న అభిమానాన్ని, చాటుకున్నారు.

 

చెల్లికి అన్న రక్షణ.. సమాజానికి పోలీసు రక్షణ అంటూ పోలీసులకు రాఖీ కట్టి ఆమె రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నప్పటికీ పండగ రోజున సైతం ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్న తమకు ఒక సోదరి ప్రేమభిమానంతో రాఖీ కట్టడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: