బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మనుబోతులగడ్డ సెకండరీ పాఠశాలలో శ్రమదానం

Homeతెలంగాణ

మనుబోతులగడ్డ సెకండరీ పాఠశాలలో శ్రమదానం

మనుబోతులగడ్డ సెకండరీ పాఠశాలలో శ్రమదానం ఖానాపురం అక్టోబర్ 24 (మల్లేష్ నమస్తే భారత్) : ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామంలోని సెకండరీ పాఠశాల ఆవరణల

అమృత్ మెమోరియల్ ట్రస్ట్* *ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ పంపిణీ
నియోడైమియం మాగ్నెటిక్ మ్యాట్రెస్ తో ఎన్నెన్నో ప్రయోజనాలు…!
చిన్నారులను అభినందించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్

మనుబోతులగడ్డ సెకండరీ పాఠశాలలో శ్రమదానం

ఖానాపురం అక్టోబర్ 24 (మల్లేష్ నమస్తే భారత్) :

ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామంలోని సెకండరీ పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు శనివారం శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆబోతు శ్రీలత అశోక్ యాదవ్ అద్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడూతూ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.గ్రామ అభివృద్ధిలో పాఠశాల పరిశుభ్రత కీలకమైనది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.
ఈ శ్రమదాన కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొడుగు రమ యాకన్న, గ్రామ కార్యదర్శి ప్రమీల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న, ఎస్‌కే నాగుల్ మీరా, మాజీ ఉపసర్పంచ్ ములుకుంట్ల యాకన్న, వార్డు నంబర్ ఆబోతు రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, యువకులు మర్రి మహేందర్, రాకేష్‌తో గ్రామస్తులు పాల్గోన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: