బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక సత్కారం

Homeతెలంగాణ

‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక సత్కారం

‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక సత్కారం తెలుగు ఐకాన్ అవార్డ్స్–2026’ హైదరాబాద్ (నమస్తే భారత్ ) : ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా

సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
సెప్టెంబరు 3,4 తేదీలలో సిపిఐ(ఎం) రాజకీయ  శిక్షణ తరగతులు..
సంక్షేమానికి పెద్దపీట.స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన సర్పంచ్ నాగ నాయక్

‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక సత్కారం

తెలుగు ఐకాన్ అవార్డ్స్–2026’

హైదరాబాద్ (నమస్తే భారత్ ) :
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా , నిరుపేదలకు చేయూతగా , సమాజ సేవను బాధ్యతగా భావిస్తూ గత ఐదు సంవత్సరాలుగా నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్‌కు ప్రతిష్ఠాత్మక ‘తెలుగు ఐకాన్ అవార్డ్స్–2026’ లభించింది.ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా, సేవే లక్ష్యంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం అందించడం, ఆహార పంపిణీ, రక్తదానం, వైద్య శిబిరాలు, ఉచిత శస్త్రచికిత్సలకు సహాయం, మహిళా భద్రత, డ్రగ్ అవేర్‌నెస్, విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పరీక్ష ఫీజుల సహాయం, ట్రాఫిక్ వాలంటీర్ సేవలు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ నిర్వహిస్తోంది.

*పెద్దల చేతుల మీదుగా ఘన సన్మానం* :

జేఎన్టీయూ కాలేజీలో నిర్వహించిన తెలుగు ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో ప్రముఖ సినీనటులు బాబూమోహన్, పృథ్వీరాజ్, ప్రభాకర్ , తదితర పెద్దల చేతుల మీదుగా ‘మేము సైతం మీకోసం ఫౌండేషన్’ టీమ్ సభ్యులను ఘనంగా సన్మానించి అవార్డులు అందజేశారు. ఈసందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కట్టేబోయిన శివకుమార్ యాదవ్ తో పాటు టీమ్ సభ్యులు ఇరుగు సత్యం, అభ్యుదయ రాజ్, శైలజ, వీరన్న, తోడేటి రూప, విక్రమ్, ఫైజల్, జీవన్, సాయి దివ్య, హీర్షాద్, మహబూబ్ పాషాలకు తెలుగు ఐకాన్ అవార్డ్స్–2026 అందజేశారు.
ఈ అవార్డు ఒక్కరి విజయం కాదు… మొత్తం టీమ్ విజయం.ఐదు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో తమ సమయాన్ని, శ్రమను, వనరులను కేటాయిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రతి ఒక్క టీమ్ సభ్యుడి నిస్వార్థ సేవకు ఈ అవార్డు దక్కిన గౌరవంగా ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.
“ఆపదలో ఉన్న ఒక కుటుంబానికి అండగా నిలవడం… ఆకలితో ఉన్న ఒకరికి అన్నం పెట్టడం… రక్తం అవసరమైన వ్యక్తికి రక్తదానం చేయడం… సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి చేయూతనివ్వడం—ఇవే మా సేవకు అసలైన అవార్డులు. అయితే మా ఐదేళ్ల సేవను గుర్తించి తెలుగు ఐకాన్ అవార్డ్స్ అందించడం మా టీమ్‌కు మరింత బాధ్యతను, స్ఫూర్తిని ఇచ్చింది”_* అని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

*సేవా ప్రయాణంలో మరింత ముందుకు…*

ఈ అవార్డు తమ సేవా ప్రయాణానికి ముగింపు కాదని, మరింత మంది బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు ఇది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని ఫౌండేషన్ టీమ్ తెలిపింది.
మానవత్వమే మార్గం… సేవే లక్ష్యం… ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే మా ధ్యేయం అని తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: