బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం

Homeతెలంగాణ.

బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం

బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం నమస్తే భారత్ :-తొర్రూరు బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని మున్

దారం శ్రీనుకు పట్టణ ప్రముఖుల పరామర్శ
పవిత్ర మహా పాదయాత్రకు సాదర ఆహ్వానం
సీతారాంపురంలో ఘనంగా ఏడవ రోజు కుంకుమ పూజ కార్యక్రమం

బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం

నమస్తే భారత్ :-తొర్రూరు

బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ అన్నారు.
తొర్రూరు పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న విమర్శలను మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజినీరాజశేఖర్ తీవ్రంగా ఖండించారు.కౌన్సిలర్లను వేదికపైకి ఆహ్వానించినప్పటికీ, తమను పిలవలేదంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వేట సంస్థపై అనవసరకు ఆరోపణలు మానుకోవాలన్నారు.
వేటా సంస్థ గురించి వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించలేదని.ఆ సంస్థ పేరుతో స్టేజిపై బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రచారం జరగలేదని, ప్రైవేటు సంస్థకు ప్రచారం కల్పించామని ఆరోపిస్తున్నప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
గతంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఉషా దయాకర్ రావు ఏ హోదాలో వేడుకలకు హాజరయ్యారని ప్రశ్నించారు.
మున్సిపల్ కమిషనర్‌ను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌గా అభివర్ణించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. అధికారుల పనితీరుపై అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, విచారణ కోరాలని సూచించారు. ఆధారాలు లేకుండా అధికారులకు రాజకీయ రంగు పులమడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: