బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ నూరుల్ ఖమర్

Homeతెలంగాణ

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ నూరుల్ ఖమర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ నూరుల్ ఖమర్ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి తుగ్గలి, నవంబర్ 4 ( నమస్తే భరత్): మం

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు
శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు
*ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి సహకరించాలి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జేసీ నూరుల్ ఖమర్

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి

తుగ్గలి, నవంబర్ 4 ( నమస్తే భరత్):

మండలంలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం తుగ్గలి మండలంలోని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చే ప్రతి ఓటరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి శేషయ్య, సహాయ ఎన్నికల అధికారులు రవి, విశ్వమోహన్, సీఐ పెద్దయ్య నాయుడు, ఎస్సైలు బాల నరసింహులు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: