బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కరువు రైతులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉపశమనం   కలెక్టర్ సత్య శారద

Homeతెలంగాణ.

కరువు రైతులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉపశమనం కలెక్టర్ సత్య శారద

కరువు రైతులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉపశమనం కలెక్టర్ సత్య శారద వరంగల్, నవంబర్ 4 (నమస్తే భారత్): కరువు ప్రభావిత మండలాల్లోని రైతులకు బ్యాంకుల ద్వా

మరిపెడలో నూతనంగా దొడ్ల డెయిరీ మిల్క్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి
సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలి 2023 చట్టాన్ని రద్దు చేయాలి
కార్మికకర్షిక గ్రామీణ పేదల కోసం నిరంతరం పోరాటం నడిపిన మహనీయుడు సీతారాం ఏచూరి

కరువు రైతులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉపశమనం

కలెక్టర్ సత్య శారద

వరంగల్, నవంబర్ 4 (నమస్తే భారత్): కరువు ప్రభావిత మండలాల్లోని రైతులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉపశమన చర్యలు సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బ్యాంకు అధికారులనుఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్‌లో కరువు ప్రభావిత రైతులకు ఆర్థిక ఉపశమన చర్యల అమలుపై జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ సమావేశ నిర్ణయాలు, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం రైతులకు అందించాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు.
కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన రైతుల పంట రుణాలను పునర్వ్యవస్థీకరించాలని కలెక్టర్ సూచించారు. రుణ చెల్లింపు గడువును పొడిగించడంతో పాటు నిబంధనల ప్రకారం మారటోరియం సదుపాయం కల్పించాలని ఆదేశించారు. తదుపరి వ్యవసాయ సీజన్‌కు రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ శాఖలు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి కరువు ప్రభావిత ప్రాంతాల్లో అర్హులైన రైతులను గుర్తించాలని, నిర్ణీత గడువులోగా ఆర్థిక ఉపశమన చర్యలను అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు కిషోర్ (రెవెన్యూ), గణేష్ (లోకల్ బాడీస్), యూనియన్ బ్యాంక్ డీజీఎం జి. కమలాకర్, ఆర్బీఐ ఎల్‌డీఓ యశ్వంత్, నాబార్డ్ డీడీఎం చైతన్య రవి, ఎల్‌డీఎం జి. జీవన్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన, మత్స్యశాఖల అధికారులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: