బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

4వ వార్డు ప్రజల కోసం ఆరోగ్య శిబిరం

Homeతెలంగాణ

4వ వార్డు ప్రజల కోసం ఆరోగ్య శిబిరం

4వ వార్డు ప్రజల కోసం ఆరోగ్య శిబిరం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, నమస్తే భారత్ :-మరిపెడ

మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం….!!
ఘనంగా పోషణ మాసం కార్యక్రమం
పెరుగుతున్న ధరలు.. కుంగుతున్న పేదల బతుకులు – నిత్యావసర ధరలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి! సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.

4వ వార్డు ప్రజల కోసం ఆరోగ్య శిబిరం

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

వార్డు కౌన్సిలర్ మెరుగు రాము,

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని 4వ వార్డు పరిధిలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొని ఆరోగ్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్యాధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము, వైద్యాధికారులు స్వామి, మంగమ్మ, అలువాల ఉపేందర్ ప్రజాపతి, సయ్యద్ సర్వర్ పాషా, మండల వాసవి క్లబ్ అధ్యక్షుడు గర్రెపల్లి నగేష్, భాషిత్ ఖాన్, ప్రేమ్ సాగర్, ఆరోగ్య సిబ్బంది ఝాన్సీ, జ్యోతి, లలిత, రజిత తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: