ఎల్ ని నో ప్రభావంతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలి పంట పొలాలకునిరంతర విద్యుత్ తొమ్మిది గంటలు సరఫరా చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి
ఎల్ ని నో ప్రభావంతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలి
పంట పొలాలకునిరంతర విద్యుత్ తొమ్మిది గంటలు సరఫరా చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి డిమాండ్
నమస్తే భారత్ :-తొర్రూరు
ఎల్ ని నో ప్రభావంతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవా లని,పంట పొలాలకు నిరంతర విద్యుత్ తొమ్మిది గంటలు సరఫరా చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .శనివారం స్థానిక విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఆందోళన.లో.ఉందన్నారు.రాష్ట్రంలో సగటు వర్షపాతం కన్నా 24 శాతం తక్కువ గా నమోద యిందని ప్రభుత్వాలు చెబుతున్నానని ,వచ్చే జూలై వరకు ఈ తొమ్మిది, పది నెలల్లో సూపర్ ఎల్ ని నో ప్రభావం తీవ్రత ఎక్కువ అవుతుందని ప్రభుత్వం వెల్లడిస్తుం దని ,దీంతో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడి తాగునీరు కొరత కూడా ఏర్పడుతుందనె ఉద్దేశంతో మరి సాగుబడి చేయొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగ సమావేశంలో చెబుతున్నారని పంటలు వేసిన వారికి ఈ 15 రోజులు కీలక దశ అని, ఈ సమయంలో సాగునీరు లేక నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడం కూడా పంటలు ఎండిపోతున్నాయని వెంటనే ప్రభుత్వం స్పందించి కనీసం 9 గంటలు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని చెప్పారు .రాష్ట్ర ప్రభుత్వం 320 మండలాలు కరువు ప్రాంతాలుగా గుర్తించి కేంద్రానికి నివేదిక ఇచ్చారని కేంద్రం తీసుకున్న చర్యల కోసం వేచి చూడకుండా వరి పంటలు వేసిన వారికి ఎకరానికి రూ30వేలు మిర్చి తదితర పంటలకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వరి పంట వేయనివారిని క్రాప్ హాలిడే పాటించిన వారిగా గుర్తించాలని అన్నారు .ఈ పరిస్థితి 2021 లో వచ్చిన కరోనా ప్రభావం కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రస్తుతం వరి పంట క్వింటాకు రెండు వేలకు మార్కెట్ ధర పలుకుతుందని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ పెరిగి కిలో వంద రూపాయలు బియ్యం కొనే పరిస్థితి నెలకొందని, ప్రజా పంపిణీ వ్యవస్థ లో పేద ప్రజలను ఆదుకోవడానికి సన్న బియ్యంతో పాటు ఇతర 14 రకాల నిత్యావసర వస్తువులను అందజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆరుతడి పంటలకు గిట్టుబాటు ధర తో ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పారు .రాబోయే రోజుల్లో పశుగ్రాసానికి మేకలకు కూడా గ్రాసం కొరత లేకుండా పరిస్థితి అంచనా వేయాలని అన్నారు . కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు గల్లంత కోట్ల సంఖ్యలో జరిగిందని ,దీనికి బాధ్యత వహిస్తూ సి ఈ సి జ్ఞానేశ్వర్ ని పదవి నుండి తప్పించాలని, ఈ విషయమై నెలలు తరబడి జరుగుతున్న ఉద్యమాలను, ఇండియా కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టనున్న నవంబర్లో ఢిల్లీలో నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఓట్లు లేకపోతే మనిషికి విలువ లేదని, ఓటు ఆయుధం లాంటిదని ఈ విషయంలో సుప్రీంకోర్టు నామమాత్రపు పాత్ర వహించడం శోచనీయమన్నారు. సాఫ్ట్వేర్ లో తప్పిదాలను సరిచేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రధానమంత్రి విపక్షాల పై మాట్లాడుతూ కాలయాపనం చేస్తున్నారని అన్నారు సర్ ప్రక్రియను రద్దు చేయాలని బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు .ఈ
కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బందు మహేందర్, ఈ యు డిపో కార్యదర్శి ఎం కృష్ణ రావు, పట్టణ కార్యదర్శి ముద్రబోయిన వెంకన్న, సహాయ కార్యదర్శి పేరబోయిన కిరణ్ కుమార్, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కోటగిరి యకాం తం, శాఖ కార్యదర్శి బూరుగు యాదగిరి, కోటగిరి కృష్ణమూర్తి, యువజన నాయకులు పేరబోయిన క్రాంతి కుమార్, వీరేష్. తదితరులు పాల్గొన్నారు

COMMENTS