విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి నమస్తే భారత్ గండిపేట్ మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హిమ
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
నమస్తే భారత్ గండిపేట్ మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హిమాయత్ సాగర్ సెక్షన్ నూతన ఏఈ రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ 123వ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్, విద్యానగర్, భూపాల్ నగర్, వెంకటేశ్వర కాలనీ, తిరుమల హిల్స్ కాలనీతో పాటు పలు బస్తీల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను ఏఈ రమేష్ దృష్టికి తీసుకెళ్లారు.
విద్యుత్ సరఫరా, ఇతర సమస్యలను వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. దీనిపై ఏఈ రమేష్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రానగర్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, శ్రీనివాస్, శాంతి నాయక్, పరశురాం, మల్లేష్, రాజు నాయక్, విద్యానగర్ జనరల్ సెక్రటరీ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

COMMENTS