బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జాతీయ సదస్సులో పరిశోధనా పత్రం సమర్పించనున్న డా. సంకినేని వెంకటయ్య

Homeతెలంగాణ

జాతీయ సదస్సులో పరిశోధనా పత్రం సమర్పించనున్న డా. సంకినేని వెంకటయ్య

జాతీయ సదస్సులో పరిశోధనా పత్రం సమర్పించనున్న డా. సంకినేని వెంకటయ్య హనుమకొండ అక్టోబర్ 29(మల్లేష్ నమస్తే భారత్ ) : హైదరాబాద్‌లోని డా. ఎం.సి.ఆర్. మానవ

మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం.
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం – 2026
హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శక్తి జ్యువలర్స్ సౌజన్యంతో షాపూర్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో కుత్బుల్లాపూర్ మండలం,

జాతీయ సదస్సులో పరిశోధనా పత్రం సమర్పించనున్న డా. సంకినేని వెంకటయ్య

హనుమకొండ అక్టోబర్ 29(మల్లేష్ నమస్తే భారత్ ) : హైదరాబాద్‌లోని డా. ఎం.సి.ఆర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 30, 31 తేదీల్లో నిర్వహించనున్న రెండు రోజుల జాతీయ సదస్సులో కాకతీయ విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డా. సంకినేని వెంకటయ్య పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు.
“ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి మరియు ప్రజా విధానం” అనే ప్రధాన అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సుకు “ఆవిష్కరణలు, విధానాలు మరియు సుపరిపాలన ద్వారా సుస్థిర ఆర్థిక వ్యవస్థల నిర్మాణం” అనే ఉపశీర్షికను నిర్ణయించారు.
ఈ సదస్సులో భాగంగా డా. సంకినేని వెంకటయ్య “గ్రామీణాభివృద్ధి మరియు స్థానిక స్వపరిపాలన: సుస్థిర ఆర్థిక వృద్ధి, సమ్మిళిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గాలు” అనే అంశంపై తన పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, స్థానిక స్వపరిపాలనా సంస్థల పాత్ర, సుస్థిర ఆర్థిక వృద్ధి, సమాన అభివృద్ధి అవకాశాలు తదితర అంశాలను ఆయన తన పరిశోధనలో విశ్లేషించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పంచాయతీరాజ్ సంస్థలు, స్థానిక పాలనా వ్యవస్థలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో పోషించే పాత్రను ఈ పరిశోధనలో చర్చించనున్నారు. అలాగే ఆర్థిక అసమానతలను తగ్గించడం, వెనుకబడిన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడం, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధిని సాధించే మార్గాలపై దృష్టి సారించనున్నారు.
డా. సంకినేని వెంకటయ్య ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమెన్స్ పీజీ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కాకతీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా కూడా సేవలందించారు.
ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ప్రజా విధానాలు, సుపరిపాలన వంటి కీలక అంశాలపై విద్యావేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తల మధ్య చర్చలకు ఈ జాతీయ సదస్సు వేదిక కానుంది. ఈ సదస్సులో డా. సంకినేని వెంకటయ్య పరిశోధనా పత్రం గ్రామీణాభివృద్ధి, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చకు దోహదపడనుంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: