వేగవరం నూతన ఎంపీటీసీ బైరెడ్డి సూర్యకుమారికి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అభినందనలు జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 9 ప్రేమ్ కిరణ్ వేగవరం
వేగవరం నూతన ఎంపీటీసీ బైరెడ్డి సూర్యకుమారికి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అభినందనలు
జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 9 ప్రేమ్ కిరణ్
వేగవరం ఎంపీటీసీ-2 స్థానం నుంచి కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బైరెడ్డి సూర్యకుమారి భర్త చిన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం సాయంత్రం శ్రీనివాసపురం విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపీటీసీగా ఎన్నికైన బైరెడ్డి సూర్యకుమారికి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఆమె ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన చిన్ని కృష్ణతో పాటు టీడీపీ నాయకులను ఆయన ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై నాయకుల మధ్య పరస్పర అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది.ఈ కార్యక్రమం మర్యాదపూర్వకంగా, ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ భేటీలో చిన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

COMMENTS