బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తొర్రూరులో ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు

Homeతెలంగాణ

తొర్రూరులో ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు

తొర్రూరులో ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్

శాస్త్రీయ నృత్యంలో అక్షయ అద్భుత ప్రదర్శన
నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలి ఎంపిడివో అద్వైత
మాజీ ఎంపీటీసీ రాజులపాటి లచ్చమ్మ కు నివాళి – కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్

తొర్రూరులో ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు

నమస్తే భారత్ :-తొర్రూరు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సూచనలతో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ ల ఆధ్వర్యంలో ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, వారి జీవితాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీపావళి వెలుగులు
నింపారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లలో దీపాలు కాకరపువ్వొత్తులు వెలిగించి, బాణాసంచా కాల్చి దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామని,నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసామని,ఇళ్లు మంజూరైన లబ్ధిదారులంతా ఆనందంగా ఉన్నారని, ఈ దీపావళి వారి జీవితాల్లో మరింత వెలుగులు నింపిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముద్ధసాని సురేష్,హౌసింగ్ ఏఈ యామిని, కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి బిక్షం గౌడ్, కర్ర అశోక్ రెడ్డి, నడిగడ్డ మధు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: