*యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దు..* *ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి* *షాద్‌నగర్‌కు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *చంద్రకళ కుటుంబా
*యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దు..*

*ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి*
*షాద్‌నగర్‌కు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
*చంద్రకళ కుటుంబానికి అండగా ఉంటాం..*
*ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం*
*బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భరోసా..*
*రూ.25 వేల ఆర్థిక సాయం అందజేత*
నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్03:కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షాద్‌నగర్‌కు చెందిన డక్కలి సామాజిక వర్గ విద్యార్థిని డాకూరి చంద్రకళ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఓ పేద కుటుంబం ఆశలు ఆవిరయ్యాయని, ఉన్నత విద్యను అభ్యసిస్తూ జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాల్సిన యువతి ఇలా అర్ధంతరంగా తనువు చాలించడం బాధాకరమని పేర్కొన్నారు. మంగళవారం షాద్‌నగర్‌లోని చంద్రకళ నివాసానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజక వర్గ చైర్మన్ జాంగారి రవి ఆధ్వర్యంలో కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించి, తల్లిదండ్రులు లక్ష్మమ్మ, చిన్నయ్యలను పరామర్శించారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఎంతో వెనుకబడిన డక్కలి సామాజిక వర్గం నుంచి ఉన్నత విద్యను అభ్యసిస్తూ ముందుకు సాగుతున్న చంద్రకళ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తానని, వ్యక్తిగతంగా కూడా అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, యువత క్షణికావేశంలో విలువైన జీవితాలను ముగించుకోవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, చదువుతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. అట్టడుగు వర్గాల నుంచి ఎంతోమంది మహనీయులు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారని, వారిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగిర్యాల కృష్ణారెడ్డి, గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్, జమృత్ ఖాన్, బాధేపల్లి సిద్ధార్థ, కౌన్సిలర్ మురళీమోహన్ ఆప్పి, కాంగ్రెస్ ఎస్సీ విభాగం నియోజకవర్గ చైర్మన్ జాంగారి రవి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహులు, గోధ మాధవులు యాదవ్, చించేడ్ అనంతం, వీర్లపల్లి అన్వర్, సురేష్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గడ్డం జంగయ్య, గొర్ల రాము, మాజీ ఉపసర్పంచ్ సీతారాం, దేవగిరి కృష్ణ, దళిత సంఘాల నాయకులు సింగపగా జంగయ్య, ఎర్ర నర్సింహులు, భేరి లింగం తదితరులు పాల్గొన్నారు.

COMMENTS