బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సబ్‌స్టేషన్‌లో మద్యం సేవించిన లైన్ ఇన్‌స్పెక్టర్ .. ?

Homeతెలంగాణ

సబ్‌స్టేషన్‌లో మద్యం సేవించిన లైన్ ఇన్‌స్పెక్టర్ .. ?

సబ్‌స్టేషన్‌లో మద్యం సేవించిన లైన్ ఇన్‌స్పెక్టర్ .. ?   ఖానాపురం అక్టోబర్ 29(నమస్తే భారత్) : నిత్యం అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాకు అంతర

షాద్ నగర్ ప్రభుత్వ కుంట హై స్కూల్ విద్యార్థినుల కు హెచ్ పి వి వ్యాక్సినేషన్ అవగాహన
వెలగని విద్యుత్ లైట్.. మూడు నెలలుగా అంధకారంలో మూడో వార్డు
హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శక్తి జ్యువలర్స్ సౌజన్యంతో షాపూర్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో కుత్బుల్లాపూర్ మండలం,

సబ్‌స్టేషన్‌లో మద్యం సేవించిన లైన్ ఇన్‌స్పెక్టర్ .. ?

 

ఖానాపురం అక్టోబర్ 29(నమస్తే భారత్) :
నిత్యం అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహించాల్సిన సబ్‌స్టేషన్‌లో ఓ లైన్ ఇన్‌స్పెక్టర్ మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నర్సంపేట డివిజన్ పరిధిలోని ఖానాపురం మండలం మంగళారిపేట గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.వివరాల్లోకి వెళితే.. బుధరావుపేట గ్రామానికి లైన్ ఇన్‌స్పెక్టర్‌గా రాజు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గురువారం సబ్‌స్టేషన్‌కు వెళ్లిన స్థానికులు, సదరు లైన్ ఇన్‌స్పెక్టర్ మరికొందరితో మద్యం సేవిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. విధి నిర్వహణ సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ఖానాపురం ఏఈ మంగమ్మను వివరణ కోరగా, సబ్‌స్టేషన్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్ మద్యం సేవించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం ఆలస్యంగా తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తన పైఅధికారులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: