వార్డ్ సభ్యులు బోళ్ల రమేష్ నాయినమ్మకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడి నివాళి బోళ్ల లచ్చమ్మ పార్థివ దేహానికి పూలమాలతో నిళులర్పించిన సమ్మిగౌడ్ నమ
వార్డ్ సభ్యులు బోళ్ల రమేష్ నాయినమ్మకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడి నివాళి
బోళ్ల లచ్చమ్మ పార్థివ దేహానికి పూలమాలతో నిళులర్పించిన సమ్మిగౌడ్
నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటి కన్నె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంటి కన్నె వార్డ్ సభ్యులు బోళ్ల రమేష్ నాయినమ్మ లచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విచారకరమని కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బోళ్ల వెంకన్న,మల్లయ్య తల్లీ లచ్చమ్మ మృతి చెందిన విషయం అక్కడ ఉన్న నాయకుల ద్వారా తెలుసుకున్న సమ్మి గౌడ్, ఆదివారం ఇంటి కన్నెలోని ఆమె నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుమారులైన బోళ్ల వెంకన్న,మల్లయ్యలను అలాగే వారి మనుమండ్లు బోళ్ల రమేష్,హరీష్,కార్తీక్ లను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి కార్యకర్తకు అండగా ఉంటుందని తెలిపారు. సంతోషంలో కాదు బాధలో మీ భుజం తట్టి మీ పక్కన నిలబడతామని భరోసా ఇచ్చారు. గ్రామాలలో ఎవరికి ఏ కష్టం వచ్చిన సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరు సమన్వయం చేసుకుంటూ బాధితులకు అండగా ఉండాలని సూచించారు. అందరు సంఘటితమై బాధలేని లోటును పూడ్చాలని పిలుపునిచ్చారు. కంటికి రెప్పలా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
సమ్మిగౌడ్.వెంట.ఇంటికన్నెకాంగ్రెస్ పార్టీ. రాజులపాటి మల్లయ్య,నల్ల మాస ఉప్పలయ్య, రోజులపాటు వెంకన్న, వరదల్లి రంజిత్,చలగోల వెంకన్న,కోతి రాజు,మిట్ట గడుపుల యాకయ్య,గంగ సిరి రమేష్,గడ్డం శ్రీనాథ్,వర్ధిల్లు రాజు తదితరులు పాల్గొన్నారు

COMMENTS