బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ

Homeతెలంగాణ

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ వెయ్యి రోజుల్లో అభివృద్ధి చేసి చూపించాం - ఎమ్మెల్యే మురళి నాయక్ అభివృద్ధి చూసి ఓర్వలేకనే అక్కసు - డిసిసి అధ్

అంతర్గత రోడ్ల దుస్థితిని పట్టించుకోండి.. వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి – కొండ ఉప్పలయ్య
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కమిటీ
ఇందిరమ్మ రాజ్యంలో.. సంక్షేమ ఫలాలు

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ : ఎంపీ

వెయ్యి రోజుల్లో అభివృద్ధి చేసి చూపించాం – ఎమ్మెల్యే మురళి నాయక్

అభివృద్ధి చూసి ఓర్వలేకనే అక్కసు – డిసిసి అధ్యక్షురాలు భూక్య ఉమా

కేసముద్రంలో ఉరకలు వేస్తున్న అభివృద్ధి

వేం చొరవతో కనీవినీ ఎరుగని రీతిలో కేసముద్రం

కాంగ్రెస్ అంటే గడీల రాజ్యం కాదు ప్రజల రాజ్యం..మీరు చేయలేని అభివృద్ధిని చూసి ఓర్వలేని తనం

వేం అన్న కు కేసముద్రం మండల ప్రజలు రుణపడి ఉంటారు.చిలువేరు సమ్మయ్య గౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం

అభివృద్ధికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మానుకోట ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన.మాట్లాడారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1000 రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అవి అర్హులకు అందించినట్లు తెలిపారు. దళిత, గిరిజన, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడ్డట్లు పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను కడుతూనే, మరో పక్క ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక గత బీఆర్‌ఎస్ 10 ఏళ్ల కాలంలో చేయలేని అభివృద్ధిని 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో చేసి చూపించామని స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. 1000 రోజుల పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదని చెప్పారు.
రూ. 60 కోట్లతో మానుకోట మునిసిపాలిటీలో అభివృద్ధి కొనసాగుతుందని, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో పాటు అనేక.పనులు.జరుగుతున్నాయని తెలిపారు.రూ. 7 కోట్లతో బంధం చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా, రూ. 2 కోట్లతో మున్సిరు వాగు వద్ద బతుకమ్మ, వినాయక నిమజ్జన ఘాట్, రూ. 9 కోట్లతో దాశరథి స్మృతి వనం నిర్మించనున్నట్లు తెలిపారు.త్వరలో 400 ఎకరాల్లో రూ. 1000 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుందని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.రూ. 350 కోట్లతో జిల్లా కేంద్రానికి ఓఆర్‌ఆర్ రాబోతుందని స్పష్టం చేశారు.కేసముద్రంలో రూ. 500 పండగల తోట అభివృద్ధి జరుగుతుందన్నారు.
కేసముద్రం అభివృద్ధి పై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ
గత ప్రభుత్వంలో అభివృద్ధిని మరుగున పడేసిన నాయకులు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమాన్ని, మౌలిక వసతుల కల్పనను చూసి ఓర్వలేక లేనిపోని అబండాలు వేస్తున్నారని కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. పాలించడం చేతకాక, అభివృద్ధి చేస్తున్న వారిని వేలెత్తి చూపడం గత పాలకుల అహంకారానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కేసముద్రం మండలంలో సుమారు రూ. 750 కోట్ల భారీ నిధులతో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు ఉరకలు వేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గడీల రాజ్యం కాదని, ఇది పూర్తిగా ‘ప్రజల రాజ్యం’ అని స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే కేసముద్రం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరాయని సమ్మయ్య గౌడ్ కొనియాడారు. “కేసముద్రం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తాగునీరు, డ్రైనేజీలు, రహదారులు, విద్య, సాగునీటి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. మండలంలోని ప్రతి గ్రామానికి ఈ అభివృద్ధి ఫలాలు సమానంగా అందుతున్నాయి” అని తెలిపారు. నిధుల సాధనలో, సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమిస్తున్న ‘వేం అన్నా’కు కేసముద్రం ప్రజలు రుణపడి ఉంటారన్నారు.కేవలం మాటలకే పరిమితం కాకుండా పనుల నాణ్యత, సమయపాలనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చెప్పారు. “రాజకీయ ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం కాదు.ఏమైనా సూచనలు, లోపాలు ఉంటే చెబితే సరిదిద్దుతాం. కేవలం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. మాటలతో కాదు, క్షేత్రస్థాయిలో జరిగే అభివృద్ధి పనులతోనే మేము సమాధానం చెబుతాం” అని స్పష్టం చేశారు.అధికారాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించడమే కాంగ్రెస్ లక్ష్యమని, మండలంలో పెండింగ్‌లో ఉన్న మిగతా పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి కేసముద్రంను మోడల్ మండలంగా తీర్చిదిద్దుతామని సమ్మయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కేసముద్రం మండల ప్రజలు వేం నరేందర్ రెడ్డి కి ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే మురళి నాయక్ రుణపడి ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ ఉమ, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యోతి, అర్బన్ అధ్యక్షుడు మనపురపు అంజయ్య, మండల అధ్యక్షుడు తెల్లంకొండ శ్రీనివాస్, పలువురు సుబ్బయ్య, అశోక్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: