బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కాల్వ సుజాతకు ఇవ్వాలి

Homeతెలంగాణ

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కాల్వ సుజాతకు ఇవ్వాలి

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కాల్వ సుజాతకు ఇవ్వాలి * వైశ్య సామాజిక వర్గానికి గౌరవం తీసుకొచ్చే నిర్ణయం అవుతుంది చౌటుప్పల్, నవంబర్ 04,(నమస్తే భ

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం – 2026
మూడో వార్డు ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
మరిపెడ మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కాల్వ సుజాతకు ఇవ్వాలి

* వైశ్య సామాజిక వర్గానికి గౌరవం తీసుకొచ్చే నిర్ణయం అవుతుంది

చౌటుప్పల్, నవంబర్ 04,(నమస్తే భారత్);మాజీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయ ఆనంద్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కోరారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ బలోపేతం కోసం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో కాల్వ సుజాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని బోయ ఆనంద్ గుర్తు చేశారు.అరెస్టు చేసే సమయంలో వస్త్రాలు చిరిగినా,ఆమె తన పోరాటాన్ని ఆపలేదు.పార్టీ పట్ల ఆమె చూపిన నిబద్ధత, త్యాగం, పోరాట పటిమను గుర్తించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కాల్వ సుజాతకు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు జరగడమే కాకుండా, వైశ్య సామాజిక వర్గానికి సముచిత గౌరవం లభిస్తుందని బోయ ఆనంద్ అభిప్రాయపడ్డారు.కాల్వ సుజాతకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా వైశ్య జాతికి మరింత వెన్నె వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సానుకూలంగా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: