పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి – పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల
పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలి –
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూరు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియకు ఈ నెల 6వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులందరూ సకాలంలో తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం తొర్రూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించే బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు.ఓటరు నమోదు గడువు నవంబర్ 6వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో సమయం చాలా తక్కువగా ఉందని, ప్రజాప్రతినిధులు, పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్,ఎన్ఎస్ యుఐ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారికి ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించి,అవసరమైన సహకారం అందించాలని సూచించారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బచ్చలి లక్ష్మణ్, నాయకులు జాటోత్ రవి నాయక్, మహబూబ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,చెవిటి సధాకర్, మేకల కుమార్,జక్కుల రామ్ రెడ్డి, గుండాల నరసయ్య, ఎనగందుల శ్రీనివాస్,రాజేష్ యాదవ్, మిత్తింటి హరీష్, గంధం సతీష్, అశోక్ రెడ్డి, కిరణ్, చిదురాల రవి, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS