*టీజీస్పడీసీల్ చీఫ్ ఇంజనీర్ రమేష్ కు వినతి* *గుబ్బల లక్ష్మి నారాయణ* *కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నమస్తే భారత్* ( నవంబర్ 3) కుత్బుల్లాపూర్ నియోజక
*టీజీస్పడీసీల్ చీఫ్ ఇంజనీర్ రమేష్ కు వినతి* *గుబ్బల లక్ష్మి నారాయణ*
*కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నమస్తే భారత్*
( నవంబర్ 3) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మంగళవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సబ్ స్టేషన్ విద్యుత్ కార్యాలయంలొ చీప్ ఇంజనీర్ రమేష్ కు గుబ్బల లక్ష్మీనారాయణ, ఆలూరు వెంకట శేషా చారి, వెంకట, శ్యామ్ లు వినతిపత్రం ఇచ్చారు.ఎస్సార్ నాయక్ నగర్ లో తరచూ కరెంటు అంతరాయం ఏర్పడుతున్న నేపద్యంలో పాత విద్యుత్ లైన్ల స్థానంలో పవర్ కండీషనర్ కేబుల్ ను ఏర్పాటు చేయించి ట్రాన్స్ఫార్మర్ల వద్ద క్రమం తప్పకుండా మెయింటినెన్స్ చేయవలసినదిగా విజ్ఞప్తి చేసిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరి వెంకట శేషాచారి, మాజీ ప్రధాన కార్యదర్శి వెంకట శ్యాం లు,గాలి లేదా వర్షం వచ్చినప్పుడు విద్యుత్ సరఫరా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పాత మెటల్ వైర్లు చెట్లు కొమ్ములకు తగలడం వల్ల తరచూ విద్యుత్ గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది దీంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. లైన్లు గత నలభై సంవత్సరాల క్రితం వేశారు కాబట్టి కొత్త లైన్లు వేయాలని కోరుచున్నాము గతంలో ఉన్న యస్ ఈ, డిఇ మరియు ఏడిఈ కి కూడా సమస్యపై వినతిపత్రం ఇచ్చారు అలాగే ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై దృష్టి సారించి ఏబీ కేబుల్ ఏర్పాటు చేయవలసినదిగా కోరుచున్నామని అలాగే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర తరచూ మెయింటినెన్స్ అయ్యేవిధంగా చూడాలని కోరుచున్నాము. కరెంటు వర్షం వచ్చినప్పుడల్లా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి స్పందించిన చీఫ్ ఇంజనీర్ రమేష్, మేడ్చల్ ఎస్ ఈ, సూపర్డెంట్ ఇంజనీర్ జ్ఞానేశ్వర్, మరియు డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ , అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్ వీరేశం,ఏ ఈ కృష్ణ సమక్షంలో ఎస్ ఆర్ నాయక్ నగర్ కు ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేస్తామని రానున్న రోజుల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలు రాకుండా చూస్తామని తాత్కాలికంగా మెయింటెనెన్స్ చర్యలు చేపడతామని చీఫ్ ఇంజనీర్ రమేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలూరీ వెంకట శేష చారి ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ గుబ్బల లక్ష్మీనారాయణ సీనియర్ బిఆర్ఎస్ నాయకులు మాజీ ఏరియా కమిటీ సభ్యులు వెంకట శ్యామ్ ఎస్ఆర్ నాయక్ నగర్ మాజీ జనరల్ సెక్రెటరీ, కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS