బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

Homeతెలంగాణ

బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ ఖానాపురం అక్టోబర్ 29( మల్లేష్ నమస్తే భారత్ ) వరంగల్ జిల్లా స్థాయి పీఎం శ్రీ పాఠశాలల పోటీల్లో ఖానాపూర్

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు ఒకరు మృతి
సెప్టెంబర్ 17విమోచనము కానె కాదు బుద్ధుల జంగయ్య చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు
నూతన కరెంటు పోల్‌కు వీధి లైట్ ఏర్పాటు

బుధరావుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

ఖానాపురం అక్టోబర్ 29( మల్లేష్ నమస్తే భారత్ )

వరంగల్ జిల్లా స్థాయి పీఎం శ్రీ పాఠశాలల పోటీల్లో ఖానాపూర్ మండలం బుధరావుపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పలు బహుమతులు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు భద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేత విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక, సృజనాత్మక రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు.
జిల్లా స్థాయి పోటీల్లో డ్రాయింగ్‌లో తేజస్విని ప్రథమ స్థానం, సంగీతంలో లోకేష్ ద్వితీయ స్థానం, స్పెల్ బీ పోటీలో మనోజ్ ద్వితీయ స్థానం సాధించారు. అలాగే నృత్య ప్రదర్శనలో విద్యార్థులు తృతీయ స్థానం పొందగా, మాక్ పార్లమెంట్‌లో ఉత్తమ భాగస్వామ్య పురస్కారాలను అందుకున్నారు.
విద్యార్థుల విజయాల పట్ల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ కాసుల రవికుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0