బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

కొందుర్గు మండలప్రజలు ఏం పాపం చేశారు కరువు మండలగా

Home.

కొందుర్గు మండలప్రజలు ఏం పాపం చేశారు కరువు మండలగా

కొందుర్గు మండలప్రజలు ఏం పాపం చేశారు కరువు మండలగా ప్రకటించపోవడానికి కారణాలేంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బుద్ధుల జంగయ్య నమస్తే భారత్ షాద్

మరిపెడలో రూ.1.50 కోట్లతో నూతన డార్మిటరీకి శంకుస్థాపన
3వ వార్డులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న
కుత్బుల్లాపూర్‌లో 22% ఇళ్లలో ఒక్క మొక్క కూడా లేదు

కొందుర్గు మండలప్రజలు ఏం పాపం చేశారు కరువు మండలగా

ప్రకటించపోవడానికి కారణాలేంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బుద్ధుల జంగయ్య

నమస్తే భారత్ షాద్ నగర్,అక్టోబర్28:కొందుర్గు మండల ప్రజలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయలేదా ఏం పాపం చేశారని కొందుర్గు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించపోవడానికి గల కారణాలు ఏంటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎన్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందుర్గు మండలం ఉత్తరం వైపు ఉన్న 10 గ్రామాలు రేగడు భూములు అయినందుకు కరువు మండలం గా ప్రకటించలేకపోయారా ఆ భూములలో పత్తి మక్కా పంటలు వేసుకున్నందుకు తేమశాతం అధికంగా ఉండి వేసిన పంటలు ఉన్నంతలో చేతికొచ్చినందుకు కరువు మండలంగా ప్రకటించలేకపోయారు ప్రభుత్వం సమాధానం చెప్పాలంన్నారు ఇసుక నేలలు కలిగిన గ్రామాలు దక్షిణం వైపున15 వరకు ఉన్నాయి వాటి సంగతి ఏంటని ప్రభుత్వాన్ని ఆయన అడిగారు రేగడి నెలలలో వేసిన పంటలు ఒక్కసారి పత్తి తీస్తే చేను మొత్తం ఖాళీ రెండోసారి తీయడానికి ఏమీ లేదు ఇసుక భూములలో వేసిన పంటలు మొత్తం ఎండిపోయాయి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిపోర్ట్ ఇచ్చింది అధికారులు అధికారుల కన్నులు మూసుకుపోయాయి అని ఆయన మండిపడ్డారు ఇప్పటికే కరెంటు కోతలతో వేసిన వరి చేనులు ఎండిపోయే దశలో ఉన్నాయని వరి చేనులు కోతకొచ్చేవరకు 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే మూలుగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా కరువు కరువు మండలాల లిస్టులో కొందుర్గు మండలం పేరు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు మండలంగా ప్రకటించాలని అందరు కొద్ది ముందే బి కే ఎన్ యు గా మండల కార్యాలయాల ముందు ధర్నాలు చెయ్యడం వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు
మండల కాంగ్రెస్ నాయకులు స్థానికఎమ్మెల్యే శంకరన్నతో మాట్లాడాలి శంకరన్న ప్రభుత్వంతో మాట్లాడి కొందుర్గు మండలం కరువు మండలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు ఒత్తిడి తీసుకురావాలన్నారు లేనియెడల అతి త్వరలోఅఖిలపక్ష సమావేశం నిర్వహించి కరువు మండలంగా ప్రకటించే వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: