బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

మరిపెడలో రూ.1.50 కోట్లతో నూతన డార్మిటరీకి శంకుస్థాపన

Homeతెలంగాణ.

మరిపెడలో రూ.1.50 కోట్లతో నూతన డార్మిటరీకి శంకుస్థాపన

మరిపెడలో రూ.1.50 కోట్లతో నూతన డార్మిటరీకి శంకుస్థాపన ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మ

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న డేవిడ్ రాజ్‌ను పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు
హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో శక్తి జ్యువలర్స్ సౌజన్యంతో షాపూర్ నగర్ డివిజన్ సంజయ్ గాంధీ నగర్లో కుత్బుల్లాపూర్ మండలం,
పత్తి కింటాకు మద్దతు ధర 12000 వేలు ఇవ్వాలి

మరిపెడలో రూ.1.50 కోట్లతో నూతన డార్మిటరీకి శంకుస్థాపన

ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన డార్మిటరీ భవనానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన డార్మిటరీ నిర్మాణంతో గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోతు రవి నాయక్, టౌన్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: