బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం

Homeతెలంగాణ.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్ నమ

జాటోత్ లచ్చిరాం పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ గంట, మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు
చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా.. గుర్రప్ప తండాలో పోషణ మాసం

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం

చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్

నమస్తే భారత్ :-మహబూబాబాద్

రాష్ట్రవ్యాప్తంగా గత 11 రోజులుగా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్, వైస్ చైర్మన్ డాక్టర్ నాగరాజు కందుల సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌బీఎస్‌కే బృందం కూడా సమ్మెలో పాల్గొని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఈ సందర్భంగా డాక్టర్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక బిల్లును మంత్రివర్గంలో చర్చించి, తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.డాక్టర్ నాగరాజు కందుల మాట్లాడుతూ, గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలపై న్యాయపరమైన సమస్యలు ఎదురైన నేపథ్యంలో, రాజ్యాంగబద్ధంగా, న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా పరిష్కారం చూపాలని అన్నారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం, పీఎఫ్ సౌకర్యం, సీనియారిటీ ఆధారిత వేతన పురోగతి, పదవీ విరమణ ప్రయోజనాలు, ప్రమాద బీమా, ప్రతి నెలా నిర్ణీత తేదీన జీతాల చెల్లింపు, బదిలీ సౌకర్యాలు, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు తదితర అంశాలు ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ శివరామ్, డాక్టర్ సంజీవ్ నాయక్, ఎన్‌హెచ్‌ఎం జేఏసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమాకర్, కంబాల నవీన్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: