బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలి  2023 చట్టాన్ని రద్దు చేయాలి

Homeతెలంగాణ.

సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలి 2023 చట్టాన్ని రద్దు చేయాలి

సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలి 2023 చట్టాన్ని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కా

ఉపాధి మాట విని.అండగా నిలిచిన సమ్మన్న గౌడ్ !
గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి
జాషువా స్పూర్తితో సాంస్కృతిక సామాజిక పోరాటాలను చేపట్టాలి

సిఇసి జ్ఞానేష్ కుమార్ ను విధులనుండి తొలగించాలి

2023 చట్టాన్ని రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నల్లపు సుధాకర్& సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ డిమాండ్

నమస్తే భారత్ :-మరిపెడ

దేశవ్యాప్త ప్రజా సంఘాల పిలుపులో భాగంగా సీఈసి జ్ఞానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలని 2023 ఎన్నికల చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి మేజర్ గ్రామపంచాయతీ లోని స్థానిక బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు బోడపట్ల రాజశేఖర్ అధ్యక్షతన సుధాకర్ మధుసూదనూ లూ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సర్) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్ చొరికి పాల్పడుతుందని విమర్శించారు. మోడీ ఎంతో కాలం సీసీ జ్ఞానేశ్ కుమార్ ను కాపాడలేడని అన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్బంధం పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆపాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా పోరాటాలను అణచి వేసే హక్కు మోడీకి లేదన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయవలసిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జేబు సంస్థగా మార్చుకొని సర్ పేరుతో దేశంలో 13 కోట్ల ఓటర్లను తీసివేయాలని చూస్తుంది. రాష్ట్రంలో 93 లక్షల ఓట్లను తీసివేయాలని చూస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ చర్యను మోడీ ప్రభుత్వం తీసుకుందని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. సరును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశంలో ఉన్న మేధావి వర్గాన్ని మధ్యతరగతి ప్రజలను కూలీలను, విద్యార్థిని విద్యార్థులను జర్నలిస్టులను కూడా కలుపుకొని జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవారికి పోరాడుతామని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమము ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి, కందాల రమేష్, నలబూరు లక్ష్మారెడ్డి, అల్లి శ్రీనివాస్ రెడ్డి, వ్యాకాశ మండల నాయకులు వడ్లకొండ ఉప్పలయ్య,జీఎంపీస్ గ్రామ నాయకులు బింగి మహేష్, చంద్ర నాయక్, బానోతు రవి, మారబోయిన మల్చూరు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: