బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

రసాయన మందుల వాడకం తగ్గిద్దాం నేల ఆరోగ్యం కాపాడుకుందాం

Homeతెలంగాణ

రసాయన మందుల వాడకం తగ్గిద్దాం నేల ఆరోగ్యం కాపాడుకుందాం

రసాయన మందుల వాడకం తగ్గిద్దాం నేల ఆరోగ్యం కాపాడుకుందాం నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ చైర్మన్ నమస్తే భారత్ :-కురవి రసాయన ఎరువులు, పురుగు మందుల వాడక

యువత మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి

రసాయన మందుల వాడకం తగ్గిద్దాం నేల ఆరోగ్యం కాపాడుకుందాం

నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ చైర్మన్

నమస్తే భారత్ :-కురవి

రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు
కురవి మండల కేంద్రంలోని రైతు వేదికలో వి సి ప్రత్యక్ష  ప్రసారం ఖేత్  బచావో అభియాన్ కార్యక్రమాన్ని ప్రత్యేక రైతు నేస్తం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడగా రైతులు, అధికారులతో కలిసి వీక్షించిన అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సాగుభూమని రక్షించుకోవడం కోసం పంటలలో వైవిధ్యాన్ని పాటించాలని, సేంద్రియ వ్యవసాయంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను గడిచడమే కాకుండా భూమి ఆరోగ్యవంతంగా ఉంటుందని సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి, ఉష్ణోగ్రతలు పెరిగాయని కనీస వర్షాలు కురిసే అవకాశం లేదని, విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంటుందని, కాబట్టి యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో వరి వేయకుండా రైతులు ఆరుతడి పంటలు వేసేలా ఆలోచన చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి నరసింహారావు, కొరవి సర్పంచ్ లక్ష్మీరాజు నాయక్, తులస్య తండ సర్పంచ్ వీరన్న నాయక్,డిఈ విజయ్ బాబు, ఏఈ నిఖిలేందర్,ఏఈవో లు రాజేశ్వరి, రమ్య, విజయేందర్,రజిని కాంత్,రవి వర్మ,ఏపిఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: