బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి:  సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

Homeతెలంగాణ

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి: సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి: సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ బంగ్లా మండలం, అబ్బాయిపాల

హరిపిరా లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
వైభవంగా కే ఎస్ ఆర్ స్కూల్లో బోనాల పండుగ
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి:

సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్

నమస్తే భారత్ :-మరిపెడ

మరిపెడ బంగ్లా మండలం, అబ్బాయిపాలెం గ్రామం,
ఎల్‌నినో ప్రభావాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు బియ్యం ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం, బియ్యం ధరలు పెంచడం వంటి చర్యలకు పాల్పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. బియ్యం సహా నిత్యావసర వస్తువులు ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వీరన్న, రమేష్, లచ్చిరాం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: