బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓటరు నమోదు కార్యక్రమం

Homeతెలంగాణ.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓటరు నమోదు కార్యక్రమం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓటరు నమోదు కార్యక్రమం   నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు

ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్
సీతారాంపురంలో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం
రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్డీఓ ఉమారాణికి వినతిపత్రం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఓటరు నమోదు కార్యక్రమం

 

నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు

ఖానాపురం పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్

ఖానాపురం అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భారత్) :

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఖానాపురం మండలం
ధర్మారావుపేటలో నర్సంపేట ఏఎంసీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఖానాపురం పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ పట్టభద్రులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు మాట్లాడుతూ, గతంలో ఓటు వేసిన పట్టభద్రులతో పాటు కొత్తగా అర్హత సాధించిన పట్టభద్రులు సైతం ప్రతి ఒక్కరూ ఫారం-18 నింపి ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని ప్రతి పట్టభద్రుడిని వ్యక్తిగతంగా కలిసి ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించి, దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.

ఖానాపురం పీఏసీఎస్ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామాల్లో అందుబాటులో లేని పట్టభద్రులు తమ వివరాలను కాంగ్రెస్ పార్టీ నియమించిన ఎన్నికల కోఆర్డినేటర్లకు అందించాలని తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఖానాపురం మండలంలోని అన్ని గ్రామాలకు ఎన్నికల కోఆర్డినేటర్లను నియమించామని, పట్టభద్రులు తమకు అవసరమైన పత్రాలను మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి కోడి మల్లేష్ యాదవ్‌తో పాటు సంబంధిత కోఆర్డినేటర్లకు అందజేస్తే, వారి ద్వారా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు నమోదు ప్రక్రియకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఖానాపురం మండల కోఆర్డినేటర్ కోడి మల్లేష్ యాదవ్, బుధరావుపేట సర్పంచ్ పెసరు రాణి–గోవర్ధన్ రెడ్డి, టీజీ యూత్ జాయింట్ సెక్రటరీ ఎల్లాగౌడ్, మాజీ ఎంపీటీసీ బిక్కి మురళి, రజనీకాంత్, ధర్మారావుపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ముధురు కుమారస్వామి, యూత్ అధ్యక్షుడు నవీన్, కార్యదర్శి లెంకలపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: