బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ” బతుకమ్మ “

Homeతెలంగాణ.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ” బతుకమ్మ “

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా " బతుకమ్మ " ఖానాపురం ఎంపీడీఓ అద్వైత ఖానాపురం అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భారత్ ) : తెలంగాణ ఆడపడుచు

గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ జాగ్రత్తలు పాటించాలి
మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ వేడుకల్లో
భగత్ సింగ్ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలి

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ” బతుకమ్మ “

ఖానాపురం ఎంపీడీఓ అద్వైత

ఖానాపురం అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భారత్ ) :

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఎంపీడీఓ వి. అద్వైత అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి మహిళ అధికారులు , మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.మహిళా ఉద్యోగులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ పాటలు, ఆటలతో సందడి చేస్తూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యత, సోదరభావం, సామాజిక సమైక్యతను పెంపొందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో ఎంపీడీఓ వి. అద్వైత, విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ, గృహ నిర్మాణ శాఖ ఏఈ నవీన, ఏపీఎం రామాదేవి, ఏపీఓ సునీత వీవో గ్రూపుల సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, మండల స్థాయి అధికారులు, మహిళ సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: