బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

జంగాలపల్లిలో వినాయక చవితి వేడుకలు:ఆరెళ్ల కుమార్ – లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

Homeతెలంగాణ.

జంగాలపల్లిలో వినాయక చవితి వేడుకలు:ఆరెళ్ల కుమార్ – లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

జంగాలపల్లిలో వినాయక చవితి వేడుకలు:ఆరెళ్ల కుమార్ - లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం టేకులపల్లి: నమస్తే భారత్,సెప్టెంబర్ 18: వినాయక చవితి

మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
ప్రజావాణిలో మండల సమస్యలపై సీపీఐ వినతిపత్రం
*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ*

జంగాలపల్లిలో వినాయక చవితి వేడుకలు:ఆరెళ్ల కుమార్ – లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

టేకులపల్లి: నమస్తే భారత్,సెప్టెంబర్ 18:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జంగాలపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రముఖులు ఆరెళ్ల కుమార్ – లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం వారం భక్తులకు,గ్రామస్థులకు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు,అలంకరణలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు,మహిళలు,పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆరెళ్ల కుమార్-లక్ష్మీ దంపతులు మాట్లాడుతూ…”విఘ్ననాథుని కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఇంటా సుఖసంతోషాలు విలసిల్లాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం”అని తెలిపారు.ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యతగా ఈ సేవలో పాల్గొనడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.గ్రామంలో పండుగ శోభను రెట్టింపు చేస్తూ,ఏటా సేవారంగంలో ముందుండే ఆరెళ్ల కుమార్ – లక్ష్మీ దంపతుల ఉదారతను,సేవా నిరతిని స్థానిక ప్రజలు,కమిటీ సభ్యులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: