బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఖానాపురంలో గడ్డివాము దగ్ధం

Homeతెలంగాణ

ఖానాపురంలో గడ్డివాము దగ్ధం

ఖానాపురంలో గడ్డివాము దగ్ధం రూ.70 వేల ఆస్తి నష్టం ఖానాపురం, సెప్టెంబర్ 17 (నమస్తే భారత్): ఖానాపురం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు గడ్

నూతన కరెంటు పోల్‌కు వీధి లైట్ ఏర్పాటు
ప్రజా సంక్షేమమే ధ్యేయం.. అంతర్గత రోడ్ల అభివృద్ధికి యుగంధర్ రెడ్డి కృషి
వీరాస్వామి తల్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్

ఖానాపురంలో గడ్డివాము దగ్ధం
రూ.70 వేల ఆస్తి నష్టం
ఖానాపురం, సెప్టెంబర్ 17 (నమస్తే భారత్): ఖానాపురం మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుడు మర్రి రవి తన ఇంటి వెనుక ఉన్న స్థలంలో గేదెల మేత కోసం సుమారు మూడు ఎకరాల గడ్డిని వాముగా ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది.
అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే నర్సంపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.70 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు మర్రి రవి తెలిపారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: