బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Homeతెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, నమస్

మహాత్మా జ్యోతిబాపూలే స్కూల్ లో వైద్యశిబిరం
పో కర్ణ గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడి మృతి.
*ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ*

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు మెమోంటోలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తు నిర్మాణానికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం వారిలో మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి అనితా దేవి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: