ప్రభుత్వ హామీల సాధన కోసం చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి టిజిఇజేఏసి అడిషనల్ సెక్రటరీ జనరల్ కీసర రమేష్ రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ తెలంగాణ ర
ప్రభుత్వ హామీల సాధన కోసం చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి
టిజిఇజేఏసి అడిషనల్ సెక్రటరీ జనరల్ కీసర రమేష్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ, డిసెంబర్ 2026న హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో ఉద్యోగుల హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని మరిపెడ టీజీఈజేఏసి అడిషనల్ సెక్రటరీ జనరల్ కీసర రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఉద్యోగులు,పెన్షనర్ల న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు భారీగా హాజరు కావాలని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1.7.2023 నుండి పెరిగిన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రతి నెల కనీసం రూ.2000 కోట్ల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేయనున్నారు.
అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను.పునరుద్ధరించాలని,న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS)ను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని,ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు కాని మిగిలిన ఉద్యోగ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరనున్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే మార్గమని,ప్రతి ఉద్యోగి,ఉపాధ్యాయుడు, పెన్షనర్ ఈసభలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిజిఏసి నాయకులు జనార్ధన చారి లింగాల మహేష్ గౌడ్, అర్జున్, దేవులా,మురళీ కృష్ణ,లెనిన్,సురేష్,సోమ్లా,వెంకటేశ్వర.రావు,మంగూ,జహీరుద్దీన్,హరి,సందీప్,కవిత,రజిత,జహేదాబేగం,శౌరీ,స్వప్న,
సుధా,ప్రకాష్,బాబురావు,సారయ్య,లాల్ చంద్,శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

COMMENTS