బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఘనంగా పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

Homeతెలంగాణ

ఘనంగా పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు పంపిణీ నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్09: ఘనంగా పేపర్ శ్రీనివాస

మహిళలకు ఉపాధి అవకాశం.. అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానం!
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ
*లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ డిపిఆర్ ను బయట పెట్టాలి.*

ఘనంగా పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు పంపిణీ

నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్09: ఘనంగా పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మఫీషియల్ కమిటీ కన్వీనర్ జి. శ్రీనివాస్ ను సన్మానించిన జర్నలిస్టులు, జనసేన నాయకులు,
యువతకు ఆదర్శప్రాయుడు, సమాజ సేవకుడు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పేపర్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీనివాస్ యువసేన నాయకులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు,బ్రేడ్లు, పండ్లు పంపిణీ చేశారు. టియుడబ్ల్యూ జే ఐజేయు మఫీషియల్ కమిటీ కన్వీనర్ జీ. శ్రీనివాస్ ను స్థానిక జర్నలిస్టులు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి పేపర్ శ్రీనివాస్ ను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఒకవైపు అభిమానులు మరోవైపు జర్నలిస్టుల మధ్య కేక్ కట్ చేసి అంబరానంటే విధంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ….తను జన్మదినం పురస్కరించుకొని అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. యువత అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని, పలువురికి ఆదర్శంగా నిలిచే విధంగా యువతను చైతన్యపరిచేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. తనపై అభిమానంతో వచ్చిన జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి టి యు డబ్ల్యూ జే (ఐజేయు) ద్వారా తీసుకు వెళ్లేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. జర్నలిజం వృత్తిలో ఉంటూ సమాజ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తున్నానని అందులో భాగంగానే డివిజన్ లోని జర్నలిస్టులకు ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నరసింహ, రాఘవేందర్ యాదవ్, రమేష్, ఇలియాజ్,ఫయాజ్, అల్వాల దర్శన్ గౌడ్, సమీ,సాబేర్, మల్లికార్జున్, నీరటి శివకుమార్,రాజు,కుమార్,శ్రవణ్ గౌడ్,జగన్, మోహన్, పేపర్ శ్రీనివాస్ యువసేన సభ్యులు రాజు నాయక్, ఎండి అష్రఫ్,ప్రవీణ్, రవి, తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్ 09ఎస్ డి ఎన్ ఆర్ 01, టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర మఫిషియల్ కమిటీ కన్వీనర్ జి. శ్రీనివాస్ తోపాటు జర్నలిస్టుల ఫోటో దృశ్యం.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: