బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి  నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి

Homeతెలంగాణ

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నమస్తే భారత్ :-కురవి భూ కబ్జాదారుల పాలవ

ఏడుపాయల లో ఘనంగా పల్లకి సేవ*
*మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసే అధికారం ఎవరిచ్చారు*
ఇల్లు కాదు.. పేదల కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యుగంధర్ రెడ్డి

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి

నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి

నమస్తే భారత్ :-కురవి

భూ కబ్జాదారుల పాలవుతున్న  విలువైన ప్రభుత్వ భూములను కాపాడాలని సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి  డిమాండ్ చేశారు.కురవి మండల కేంద్రంలో.అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజావాణిలో ఎంపీడీవో వీరబాబు.కి సిపిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విలువైన ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ రెవిన్యూ అధికారులు నమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరించడం వలన భూ బకాసురులు బోగస్ పత్రాలతో.ఆక్రమించుకుంటున్నారని సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించి సూచిక బోర్డులు పెట్టాలని గతంలో అనేకసార్లు తహిసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చినప్పటికీ పెడచెవిన పెట్టడం వలన యదేచ్ఛగా అక్రమనలు.జరుగుతున్నాయని, ఎస్సీ హాస్టల్ తో పాటు పలు కార్యాలయాలు ప్రైవేట్ భవనాలలో.కిరాయిలకు,ఎంపీడీవో కార్యాలయం శిథిలావస్థలో ఉన్నది కాబట్టి నూతన భవనాల మంజూరి కోసం స్థలాలు కావాలని సాక్షాత్తు ఎమ్మెల్యే రెవిన్యూ అధికారులను  కోరినప్పటికీ కాగితాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించకుండా తాత్పర్యం చేయటం,ఇటీవల పలు ఆరోపణలు రెవెన్యూ అధికారులపై వస్తున్నప్పటికీ కనీస స్పందన లేకపోవడంతో పలు అనుమానాలు వస్తున్నాయని,177 సర్వే నెంబర్ లో గత తాహిసిల్దార్ హరిత హోటల్, మహిళలకు పెట్రోల్ బంకులకు,ఎంపీడీవో కార్యాలయానికి  స్థలాన్ని ఇస్తానని చెప్పారు కాబట్టి 177 సర్వే నెంబర్ తో పాటు కొరవి గ్రామ కేంద్రంలో ఎంత ప్రభుత్వ భూమి ఉన్నదో తక్షణమే జిల్లా సర్వేయర్ తో సమగ్ర సర్వే చేయించి,హద్దురాళ్ళను సూచిక బోర్డులను కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాటు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బుడమ వెంకన్న దూది కట్ల సారయ్య కన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు

COMMENTS

WORDPRESS: 0
DISQUS: