బ్రేకింగ్ న్యూస్
Loading latest news...

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ

Homeతెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ నమస్తే భారత్:-మరిపెడ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం

వెలగని విద్యుత్ లైట్.. మూడు నెలలుగా అంధకారంలో మూడో వార్డు
మక్తల్,అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
విద్యార్థులకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుర్రం వెంకన్నను అభినందించిన పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ

నమస్తే భారత్:-మరిపెడ

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంకితభావంతో సేవలందిస్తూ, విద్యారంగంలో విశిష్ట సేవలు అందించిన గుర్రం వెంకన్న, SGT, యం .పి .పి .యస్ . రాంపురం మహబూబాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం అభినందనీయమని పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి, లింగాల మహేష్ గౌడ్ పేర్కొన్నారు.ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ,విద్యార్థుల విద్యాభివృద్ధి,వ్యక్తిత్వ వికాసం,క్రమశిక్షణతో పాటు పాఠశాల అభివృద్ధికి వెంకన్న చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తూ,తన సేవా దృక్పథంతో.సహచర.ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించడం ఉపాధ్యాయ.సమాజానికే.గర్వకారణమన్నారు.ఈ సందర్భంగా పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ పక్షాన గుర్రం వెంకన్న ను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని, విద్యార్థుల జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయనను అభినందించిన వారిలో పిఆర్టీయూ బాధ్యులు యాకయ్య,విజయ్.కుమార్,బాబురావు,హీరాలాల్,వినోద్,విజయ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0