*మెదక్‌లో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు విస్తృత పర్యటన* *పాపన్నపేటలో IGL వాటర్ ప్లాంట్ ప్రారంభం.. అరికెల, నాగ్సన్‌పల్లి, నర్సింగ్రావు
*మెదక్‌లో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు విస్తృత పర్యటన*

*పాపన్నపేటలో IGL వాటర్ ప్లాంట్ ప్రారంభం.. అరికెల, నాగ్సన్‌పల్లి, నర్సింగ్రావుపల్లిలో బోర్‌వెల్స్ ఏర్పాటు*
*లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, పెన్షన్ చెక్కుల పంపిణీ*
*ప్రజా సంక్షేమమే లక్ష్యం.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రావు ప్రాధాన్యత*
మెదక్, సెప్టెంబర్ 2, (నమస్తే భరత్)
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు బుధవారం తన షెడ్యూల్ ప్రకారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలను అందించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పాపన్నపేట మండలం అరికెల గ్రామంలో IGL వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
అదేవిధంగా పాపన్నపేట మండలంలోని అరికెల, నాగ్సన్‌పల్లి, నర్సింగ్రావుపల్లి గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు MSSO ఆధ్వర్యంలో తన సొంత నిధులతో బోర్‌వెల్స్ ఏర్పాటు చేయించి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను నిరంతరం చేపడతామని ఆయన తెలిపారు.
పాపన్నపేట మండలం MPDO కార్యాలయ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. CMRF చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మెదక్ పట్టణం H కన్వెన్షన్ మెదక్ మండలానికి సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. అదే సమయంలో CMRF చెక్కులను కూడా పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అదేవిధంగా హవేలీ ఘన్‌పూర్ మండలంలోని రైతు వేదిక వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఎమ్మెల్యే తన పర్యటనలో భాగంగా నాగ్సన్‌పల్లి గ్రామ సర్పంచ్ కుమారుడి హాజరై నూతన వధూవరులను, కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రజలకు తాగునీరు, రేషన్, పెన్షన్ వంటి ప్రాథమిక అవసరాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
*జారీ చేసిన వారు: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, మెదక్*

COMMENTS