వినాయకుని ఆశీస్సులతో ఐదో వార్డులో ఘనంగా అన్నదానం నమస్తే భారత్ :-మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 5వ వార్డులోని పలు కాలనీలు హౌసింగ్ బోర్డు కాలనీ మెయి
వినాయకుని ఆశీస్సులతో ఐదో వార్డులో ఘనంగా అన్నదానం
నమస్తే భారత్ :-మరిపెడ
మున్సిపల్ కేంద్రంలోని 5వ వార్డులోని పలు కాలనీలు హౌసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డులో గల ఇస్లావత్ శ్రీను, పవన్ డిటిపి, వారి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా, అన్నదాన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు అభినవ్ రెడ్డి, మరిపెడ పట్టణ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.వినాయక చవితి ఉత్సవాల్లో అన్నదానం చేయడం గొప్ప సేవా కార్యక్రమమని, భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా సేవాభావం, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతాయని అన్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించుకోవాలని కోరారు.
అన్నదాన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అఫ్జల్, మూడో వార్డు కౌన్సిలర్ రాములు నాయక్, సర్వార్ బాయ్ శ్రీను ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.

COMMENTS