సీతారాంపురంలో ఘనంగా ఏడవ రోజు కుంకుమ పూజ కార్యక్రమం నమస్తే భారత్ :-మరిపెడ పట్టణ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో బైండ్ల సంఘం ఆధ్వర్యంల
సీతారాంపురంలో ఘనంగా ఏడవ రోజు కుంకుమ పూజ కార్యక్రమం
నమస్తే భారత్ :-మరిపెడ
పట్టణ కేంద్రంలోని మూడో వార్డు సీతారాంపురం కాలనీలో బైండ్ల సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన గణపయ్యకు ఏడవ రోజు కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గణనాథుడికి కుంకుమ పూజ చేశారు. కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పూజా సామగ్రితో హాజరై గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కుంకుమ పూజ కార్యక్రమం భక్తి వాతావరణంలో కొనసాగింది. మహిళలు గణపయ్యకు కుంకుమ సమర్పించి, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు.బైండ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

COMMENTS